సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో శాంత్రిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. ‘ కుప్పంలో అధికార పార్టీ వైసీపీ చట్టవిరుద్ధమైన పద్ధతులను అవలంభిస్తోంది. గత ఐదేళ్లూ టీడీపీ నేతలను ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు కూడా కొంత మంది అధికారులు కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసి, ఓటర్లను ప్రభావితం చేయాలని వైసీపీ యోచిస్తోంది. ఏ సంఘటన జరిగినా వీడియోలతో చిత్రీకరించే ఏర్పాట్లు చేయాలి’ అని కోరారు.