అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జగ్గంపేట ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడారు. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో తనకు జరిగిన అన్యాయంపై నల్లమిల్లి పోరాడుతున్నారు. టీడీపీకే ఈ సీటు ఇవ్వాలని కోరు తూ యాత్ర చేపట్టారు. దీంతో బీజేపీ అనపర్తి సీటుని టీడీపీకి వదులుకోవడానికి సిద్ధమైంది. బదులుగా బీజేపీకి కేటాయిస్తారన్న స్థానంపై టీడీపీ నుంచి సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాను అనపర్తి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగుతానని నల్లమిల్లి.. చంద్రబాబుకి చెప్పారు. బీజేపీకి ఇచ్చే సీటుపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని బాబు హామీ ఇచ్చారు.