గుంటూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి పెమ్మసాని సోదరుడు పెమ్మసాని రవిశంకర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఏ కారణంతో అయినా చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే అప్పుడు రవిశంకర్ టీడీపీ అభ్యర్థి అవుతారు. ఈ సందర్భంగా రవిశంకర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు రూ.1,655 కోట్లుగా పేర్కొన్నారు. రవిశంకర్ పేరు మీద స్థిర చరాస్తులు రూ.593.68 కోట్లు, ఆయన సతీమణి చోడే జ్యోతి పేరుతో రూ.542.87 కోట్లు ఉన్నట్టు తెలిపారు. కుమారుడు అర్జున్ పేరుతో రూ.260.30 కోట్లు, కుమార్తె సంజన పేరుతో రూ.260.34 కోట్ల ఆస్తులు ఉన్నాయి.