రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, అనకాపల్లి లోక్‌సభ స్థానంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ అన్నారు. తన విజయం ఖాయమని.. రాష్ట్రంలో జగన్‌ను సాగనంపాలని జనం కసితో ఉన్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తాను ఐదేళ్ల కిందట బీజేపీలో చేరానని.. తన పనితీరు, నడవడిక చూసి మోదీ ఆదేశిస్తేనే అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు.