పేదల కలల్ని అర్దం చేసుకుని మీ జగన్, మీ బిడ్డ 40 స్కీమ్స్ తెచ్చాడని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మీ కలల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కానని, ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశానని చెప్పారు. నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని గర్వంగా చెప్పారు. నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు.. ఇలా డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క వైయస్ జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.