ఏపీ సీఎం జగన్ పై ఎలక్షన్ కమిషన్‌కి టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. కోడ్ ఉల్లంఘించి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో టీడీపీ, జనసేన నేతలు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఫిర్యాదుపై సీఈవో జగన్ వివరణ కోరారు. అయితే సీఎం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఈసీ అంటోంది. ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా.. జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం.. నియమావళికి విరుద్ధమని నివేదికలో ఈసీ పేర్కొంది. సీఎం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని తెలిపింది. తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయం మరింత హీటెక్కుతోంది. నిన్న మొన్నటి వరకూ ఓటర్ల లిస్ట్‌లో అవకతవకలకు పాల్పడిన వైసీపీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. స్వయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే విపక్ష నేతలను బహిరంగంగా తూలనాడటం చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ, జనసేన నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.