బైక్ దొంగతనాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓ యువకుడు డబ్బు సంపాదించడానికి వింత మార్గం ఎంచుకున్నాడు. యూట్యూబ్‌లో బైక్‌లను ఎలా దొంగతనం చేయాలి? అనే వీడియోలు చూసి పద్ధతులు నేర్చుకున్నాడు.అలా నేర్చుకున్న ట్రిక్స్‌తో ఖరీదైన బైకులను టార్గెట్ చేసి దొంగలించి, వాటిని తక్కువ ధరలకు అమ్ముతూ జల్సాలు చేసేవాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి తన దొంగతనాలన్నింటినీ ఒప్పుకున్నాడు. ఈ సంచలన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఆరిఫ్ 2024 నుంచి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో పగలు రికీ నిర్వహించి, రాత్రి తాళాలు వేసి పార్క్ చేసిన ఖరీదైన బైకులను దొంగిలించడం తన వృత్తిగా మార్చుకున్నాడు.అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో కూడా అతను దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే సోమవారం పీలేరు సమీపంలోని పొంతల చెరువు క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆరిఫ్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో ఆరిఫ్ తన నేరాలను అంగీకరించాడు. దొంగిలించిన బైకులను ఎవరెవరికి అమ్మాడో కూడా వివరించడంతో ఆ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన వాటిలో ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్, పల్సర్ వంటి ఖరీదైన బైకులే ఉన్నట్లు గుర్తించారు.యూట్యూబ్‌లో చూసి బైకులను ఎలా దొంగతనం చేయాలో నేర్చుకుని వాటినే టార్గెట్ చేసిన ఆరిఫ్ వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 24 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొన్ని వాహనాలను రికవరీ చేయాల్సి ఉందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa