ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేముందని, చెప్పుకోడానికి కూడా ఏమీ లేదని.. ఆయన జిల్లాల పర్యటనకు ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. అంతా దోపిడీ, నాశనం తప్పితే ఏం లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేదిలేదని ముఖ్యమంత్రికి అర్ధమయిందని.. అందుకే రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒకసారి తిరిగి.. అవినీతి లెక్కలు చూసుకోవడానికే సీఎం జగన్ జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆయన విమర్శించారు.