ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెటర్ నుంచి అంపైర్‌గా ధోనీ.. నెటిజన్లను ఆశ్చర్యపరిచిన వీడియో

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 08:58 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ కోసం తమ ప్రిపరేషన్స్‌ను ప్రారంభించింది. మార్చి 1 నుంచి టీమ్ ట్రైనింగ్ క్యాంప్ మొదలైంది. మొదటి రోజు నుంచే భారత స్టార్ ప్లేయర్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటూ జట్టుకు జోష్ తీసుకొస్తున్నారు.అయితే అందరి దృష్టి మాత్రం దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపైనే నిలిచింది. సీఎస్‌కే క్యాంప్‌లో ధోనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వరుసగా వైరల్ అవుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ షేర్ చేసిన ఓ వీడియోలో ధోని సరదాగా అంపైర్ అవతారం ఎత్తి ‘వైడ్’ బాల్‌కు సిగ్నల్ ఇస్తూ కనిపించాడు.
-ధోని ఎందుకు అంపైర్‌గా మారాడు? చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒక సరదా వీడియోను పోస్ట్ చేసింది. అందులో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక బంతి వైడ్‌గా వెళ్లింది. వెంటనే అతను అంపైర్‌లా చేతులు చాపి ‘వైడ్’ సిగ్నల్ ఇస్తూ సరదాగా నటించాడు. ఈ ఫన్నీ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు ఫ్యాన్స్ అయితే దీన్ని ‘ధోని డాన్స్’ అని కూడా కామెంట్ చేస్తున్నారుధోని సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో చేరినప్పటి నుంచి ఫ్రాంచైజీ అతనికి సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేస్తోంది. ప్రాక్టీస్ తొలి రోజే ధోని, రుతురాజ్ గైక్వాడ్ కలిసి నెట్స్‌లో భారీ షాట్లు కొడుతున్న వీడియోను కూడా సీఎస్‌కే విడుదల చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ధోని కలిసి ఈసారి సీఎస్‌కేను ఆరోసారి ఛాంపియన్ చేయాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు.
-ఐపీఎల్ 2026లో సీఎస్‌కే జట్టు రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హాత్రే, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), శివం దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, అకీల్ హొస్సేన్, మ్యాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, జకారీ ఫౌల్క్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa