Pakistan: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఆందోళన నెలకొంది. ముస్లిం దేశమైన ఇరాన్‌కు మద్దతు ఇవ్వాలా లేదా అన్న విషయంలో పాక్ నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది.ఇదే సమయంలో ఇరాన్‌పై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ అంశం పాకిస్తాన్ పార్లమెంట్‌లో కూడా పెద్ద చర్చకు దారితీసిందని అక్కడి రాజకీయ నాయకులు పేర్కొన్నారు.పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖాదీర్ పటేల్ ఇజ్రాయిల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “పాకిస్తాన్-ఇజ్రాయిల్ మధ్య ప్రస్తుతం ఒకే దేశం మిగిలి ఉంది, అది ఇరాన్. ఇప్పటికే ఆ ప్రాంతంలో వారి ప్రభావం పెరిగింది. ఇప్పుడు ఇరాన్ మాత్రమే మిగిలింది. మీరు నమ్మినా నమ్మకపోయినా, తర్వాతి టార్గెట్ పాకిస్తానే కావచ్చు” అని ఆయన అన్నారు. విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ, ఇలాంటి ఒప్పందాలు పాకిస్తాన్‌ను రక్షించవని హెచ్చరించారు. యుద్ధంలో మరణించిన ఖమేనీని కూడా ఆయన అమరవీరుడిగా పేర్కొన్నారు.మరో ఎంపీ అలీ మహ్మద్ ఖాన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. “ఇరాన్ మాత్రమే లక్ష్యమని అనుకుంటున్నారా? అది కేవలం ఒక కారణం మాత్రమే. అసలు టార్గెట్ పాకిస్తాన్ కావచ్చని” ఆయన హెచ్చరించారు. గతంలో ఇజ్రాయిల్ మాజీ ప్రధాని డెవిడ్ బెన్ గురియన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, పాకిస్తాన్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. “మీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీపై కుట్రలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు.గతంలో పాకిస్తాన్ ఏర్పాటుపై బెన్ గురియన్ మాట్లాడుతూ, ఒక సిద్ధాంతానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఏర్పడిందని, అది మిత్రదేశం భారతదేశాన్ని విభజించి సృష్టించబడిన దేశమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇరాన్‌కు నష్టం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్‌పై కూడా పడే అవకాశం ఉందని పాక్ నేతలు హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా ఖమేనీ హత్య అనంతరం పాకిస్తాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి జరగగా, లాహోర్, ఇస్లామాబాద్, స్కర్దు వంటి నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 90 మంది గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa