తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్ర లో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ప్రసంగించారు. కాగా ఇటీవల విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేని అనంతపురం జిల్లా నేతలు ఈరోజు విజయనగరం జిల్లాలో చంద్రబాబును కలిసారు. రాప్తాడు టీడీపీ అభ్యర్ధిని పరిటాల సునీత, పలమనేరు అభ్యర్ధి అమరనాథరెడ్డి, ఉరవకొండ అభ్యర్ధి పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు నాయుడు బీ.ఫామ్స్ అందించారు. ఇటీవల పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోవటంతో విజయనగరం జిల్లాలో ఆ నేతలకు బీ.ఫామ్స్ ఇచ్చారు.