దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ సాయంత్రం ఈదురు గాలులతో భారీగా ప్రారంభమైంది.దీంతో రోజంతా ఉక్కపోతతో అల్లాడిన ఢిల్లీ వాసులకు సాయంత్రం ఉపశమనం లభించింది.పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదవుతుండగా, సాయంత్రం వర్షం కురియడంతో 22.6 డిగ్రీలకు పడిపోయింది. ప్రస్తుతం దేశంలో హీట్‌వేవ్ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.