కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడి దర్శన టికెట్లు బుధవారం విడుదల కానున్నాయి. జులై నెలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రిలీజ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల టికెట్లు విడుదల అవుతాయని టీటీడీ తెలిపింది.