రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలె రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి నాలుగు మండలాల నుంచి అత్యధికంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమాయాతం అవుతున్నారు. బుధవారం రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు రాజాం పట్టణానికి చేరుకొని సందడి చేస్తున్నారు. నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వైసిపి నాయకులు చెబుతున్నారు.