ఎన్నికలకు సిద్ధమైన రాజకీయ పార్టీలు రాయలసీమలోని నీటి ప్రాజెక్టులపై తమ విధానాలను ప్రకటించాలని జల సాధన సమితి అధ్యక్షుడు ఆర్. రాంకుమార్, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలకులు, ప్రభుత్వాలు మారినా రాయలసీమలో సాగు తాగు నీరు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.