నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్సుకు చెందిన బాధితురాలి పేరు షావోయు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుడిని దయనీయంగా మార్చిందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదించింది. యూనివర్సిటీలో చదువుతుండగా షావోయూ ప్రియుడితో రిలేషన్‌షిప్ పెట్టుకుంది. ఆ తర్వాత ప్రియురాలు తనపై ఎక్కువగా ఆధారపడడం, అన్నివేళల్లో ఆమెకు తన అవసరం పెరిగిపోవడంతో అతడు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. రోజుకు 100 సార్లకుపైగా బాయ్‌ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె ‘లవ్ బ్రెయిన్’ అనే సరికొత్త వ్యాధికి గురైంది.