పామూరు చెకోపోస్టు వద్ద బుధవారం ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక కారులో సరైనా అనుమతి పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. క్షుణ్ణంగా పరిశీలించగా రూ. 2, 57, 750. నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రూ. 50 వేలకు మించి నగదు ఉంటే అనుమతి పత్రాలు చూపించాలని, లేకుంటే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.