‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ నా ప్రతి కష్టంలో నా వెంట నిలిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం మహానేత వైయస్‌ఆర్, ఆయన బిడ్డగా వైయస్‌ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మీ బిడ్డ జగన్ ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’’ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.