ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన తెలుగుదేశం,బిజేపి,జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డితోపాటు మాజిమంత్రి రావెల కిషోర్ బాబు,లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి,పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి,పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి,విల్సన్ బాబు,పానుగంటి చైతన్య,ఎస్సీ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ లు ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేసి ఇందుకు ఆధారాలను అందించారు. తెలుగుదేశం ఎన్ ఆర్ ఐ విభాగం యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించారని ఇది ఎంసిసికి వ్యతిరేకం కాబట్టి పూర్తి విచారణ జరిపి ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ వింగ్ ద్వారా జరిగిన ఆర్దిక లావాదేవీలపై విచారణ చేయాలని కోరారు. అలాగే జయరాం పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరారు. తెలుగుదేశం పార్టీ వివిధ పత్రికలలో ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ఇచ్చిన ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. టిడిపి-బిజేపి-జనసేన కూటమికి సంబంధించి జగన్ కు వ్యతిరేకంగా నిరాధారమైన అంశాలతో కూడిన వీడియో ప్రకటనను ఏబిఎన్ తెలుగు ఛానల్ ప్రసారం చేస్తున్నారని,అది ఎంసిసికి వ్యతిరేకం కాట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. జనసేన పార్టీకి చెందిన మర్రెపు సురేష్ అనే వ్యక్తి గజపతినగరంలో ఈనెల 23 వతేదీన ముఖ్యమంత్రి జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గజపతినగరం, ఆముదాలవలస, పాతపట్నం ప్రాంతాలలో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఈనెల 23 వతేదీన వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈనెల 23 వతేదీన ఉప్పాడ సభలో వైయస్సార్ సిపి తరపున పోటీచేస్తున్న అభ్యర్దులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. . పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జాతీయపతాకాన్ని అవమానించే రీతిలో వ్యవహరించారు.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం.దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.