మహిళల పాలిట చంద్రబాబు రాక్షసుడని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఈయన అధికారంలోకి వస్తే పది లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తారట. మరి, 2014–19 మీ పాలనలో వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణాలు ఎత్తేసినది మర్చిపోయారా? అని నిలదీశారు. వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ..... ఉత్తరాంధ్రలో చంద్రబాబు మహిళా సదస్సులంటూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆయన మహిళల కోసం ఏదో చేశారట..మహిళా పక్షపాతి అని చెప్పుకొచ్చాడు. అతని మాటలు విని మహిళలు నవ్వుకుంటున్నారు. ఇంతటి పచ్చి అబద్ధాలు కూడా చెప్తారా అని నవ్వుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మహిళా ద్రోహి, మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఈయన అధికారంలోకి వస్తే పది లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తారట. మరి, 2014–19 మీ పాలనలో వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణాలు ఎత్తేసినది మర్చిపోయారా? దీని వల్ల ఏ, బీ గ్రేడ్‌లలో ఉన్న డ్వాక్రా సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను మోసం చేసి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా వారిని అప్పుల పాలు చేసింది మీరు కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మహిళల కోసం చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉందా? రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా? దీనివల్ల, డ్వాక్రా మహిళలు రూ.3వేల కోట్ల అపరాధ వడ్డీ బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చింది చంద్రబాబే. ఆడ బిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తానన్న మీరు ఒక్కరికైనా ఇచ్చారా? గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబే. ఇన్ని మోసాలు చేసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని మహిళలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.