సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తెలిపారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఇంతియాజ్ గొప్ప మెజారిటీతో గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇంతియాజ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ,కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, జిల్లా అధ్యక్షురాలు సీత్ర సత్యనారాయణమ్మ,ఎంపీ అభ్యర్థి బి.వై రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నాయకులు అహ్మద్ అలీ ఖాన్, తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.