రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. అందులో భాగంగానే పదవ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది వాలంటీర్లు శనివారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 15, 16వ వార్డులకు చెందిన వాలంటీర్లు సచివాలయ అడ్మిన్ కు రాజీనామ పత్రాలను అందించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరారు.