బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. శనివారం అధికారులు నామినేషన్‌ను ఆమోదించారు. కృష్ణమోహన్‌కు చెందిన క్రిస్టల్ సీ ఫుడ్స్ కంపెనీ విద్యుత్ బకాయిలు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదంటూ ప్రత్యర్ధులు శుక్రవారం స్కూటీని సమయంలో అభ్యంతరం లేవనెత్తారు. అయితే ఇందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ను ఆమోదించారు.
శుక్రవారం చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పత్రంపై నిర్ణయాన్ని రిటర్నింగ్ అధికారి జి.సూర్యనారాయణరెడ్డి పెండింగ్‌లో పెట్టారు. కృష్ణమోహన్ రూ.4.63 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ఆర్వోకు ఫిర్యాదు అందడంతో దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. శనివారం ఉదయానికల్లా విద్యుత్తు బిల్లుల చెల్లింపుల పూర్తి వివరాలు, పత్రాలు సమర్పించాలని ఆమంచిని ఆర్వో ఆదేశించారు. ఆమంచి వివరణ ఇవ్వడంతో ఆర్వో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.