ఓటమి భయంతో చంద్రబాబులో వణుకుమొదలైందని, అందుకనే సీఎం వైయస్ జగన్ గారిపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... జగన్.. నిన్ను చంపితే ఏం అవుతావ్? అని చంద్రబాబు అనడం వెనక పెద్ద కుట్ర కనిపిస్తోంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓట్ల కోసం ఇలాగేనా మాట్లాడేదీ? ఆయన్ను చంపమని అనటంలో ఉద్దేశం ఏంటి? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుకు సమాజంలో తిరిగే అర్హత లేదు. చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు పోటీకి అనర్హుడుగా ఎన్నికల కమిషన్ ప్రకటించాలి . 151 సీట్లను గెలుచుకుని ప్రజల ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలి. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు పిలుపునివ్వగానే విజయవాడలో జగన్ పై హత్యాయత్నం జరిగింది. గాల్లోనే వస్తాడు, గాల్లోనే ఫినిష్ అవుతాడు అని కూడా గతంలో చంద్రబాబు అన్నారు. ప్రజాభిమానంతో గెలుపొందిన జగన్ గారి పై ఎందుకంత ద్వేషం?. రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ పచ్చ కండువా కప్పుకుంటే బెటర్. ప్రజాస్వామ్యమం అనే ముసుగులో నిమ్మగడ్డ టిడిపికి అనుకూలంగా పని చేయటం ఎందుకు?. గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్ గా ఉండి టీడీపీ నాయకులను రహస్యంగా కలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నేతృత్వంలోని కమిటీలను,వాటి ఫిర్యాదులను ఎన్నికల కమీషన్ అడ్డుకోవాలి. ఎన్నికల అధికారికి ఈ విషయంపై అనేకసార్లు ఫిర్యాదులు చేశాం . ఎన్నికల కమీషన్ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినా సరైన సమాధానం ఇవ్వట్లేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాం అని తెలిపారు.