రైతును రాజును చేసేలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో రూపొందించారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మేనిఫెస్టోపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..... సీఎం వైయస్ జగన్ పాలనలో రైతులకు ఎప్పుడూ జరగని మేలు జరిగింది. కౌలు రైతులకు సైతం రైతుభరోసా పథకాన్ని జగన్ అందించారు. ఆర్.బీ.కే.ల ఏర్పాటుతో అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకు అందేలా జగన్ చేశారు. ఉచిత రైతు భీమా నుండి రైతులకు అన్ని రకాలుగా మేలు చేశారు. జగన్ గొప్ప ఆర్థిక వేత్త. అందుకే రైతుల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుని పథకాలను అమలు చేశారు.చుక్కల భూముల సమస్యలను జగన్ పరిష్కరించారు. భూముల రీసర్వే చేసి రైతులకు మేలు చేకూర్చారు. రైతు భరోసా కేంద్రాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పంటకు అవసరం అయినా పనులతో పాటు ఒకవేళ నష్ట పోయిన రైతులకి ఈ కేంద్రాలు ఊపయోగకరంగా ఉంటాయి. రుణమాఫీల పేరుతో మోసం చేసే సంస్కృతి జగన్ ది కాదు. ప్రజలకు చేయగలిగినవి మాత్రమే జగన్ మేనిఫెస్టోలో పెట్టారు అని అన్నారు.