ఇంటింటికి అందుతున్న పింఛన్లను అడ్డుకుని..ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పింఛన్ల పంపిణీపై చంద్రబాబు తీరును సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వృద్ధులు, వికలాంగులకు నాలుగున్నరేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తోంది. చంద్రబాబు తన బినామీలతో వాలంటీర్లు వైఎస్సార్సీపీకి ప్రచారం చేస్తారనే సాకు చూపి వాళ్లను పక్కన పెట్టడానికి తానే కారణం అయ్యాడు. ఏప్రిల్1న ఇవ్వాల్సిన పింఛన్ కొత్త ఏడాది అయినందువల్ల 3వ తేదీ ఇస్తే దాన్నీ కూడా యాగీ చేశాడు. దానికి ఆయన చెప్పిన కారణం వాలంటీర్లు వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తుంటే పార్ట్ టైమర్స్ అయినా సరే..వారిపై ప్రజల్లో అభిమానం ఉండొచ్చు. ఈ ఎన్నికల నెలలో వాళ్లెళ్లి ఇచ్చినంత మాత్రానా ప్రభావితం చేస్తారని అనుకోవడం పొరపాటని ఆనాడే చెప్పాం. 2.60లక్షల మంది వాలంటీర్లు అనేకమైన సేవలు అందిస్తున్నారు. వాటిలో పింఛన్లు పంపిణీ చేయడం ఒకటి. ఎప్పటికప్పుడు వారికి భరోసా ఇస్తూ పథకాలు లేకపోతే వాలంటీర్లకు ఆదరణ ఎందుకుంటుంది? అల్టిమేట్‌గా అది వాలంటీర్ల వల్ల కాదు..వారు అందుకుంటున్న బెన్‌ఫిట్ ఎవరిస్తున్నారో వాళ్లకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అది వాలంటీర్ల వస్తుందని కాదు. నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన జగన్ గారిపై అభిమానం తగ్గుతుందా? నువ్వు చెప్తే నిన్ను ఎక్కడ వెంటపడి కొడతారో అనే భయంతో ఒక బినామీ సంస్థతో ఆ వ్యవస్థను ఆపించాడు. సుప్రీం కోర్టుకు వెళ్లారు..ఎన్నికల కమిషన్‌పై వత్తిడి చేశారు. చివరికి వారు అనుకున్నది సాధించారు అని అన్నారు.