అవ్వాతాతలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పింఛన్ అందకుండా అడ్డుకున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పింఛన్ల కోసం వెళ్లి 46 మంది వృద్ధులు మరణించడానికి కారణం చంద్రబాబే అన్నారు. వాసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... వృద్ధులు, వికలాంగుల సంక్షేమం గురించి చంద్రబాబు ఏ రోజు ఆలోచించలేదు.పెన్సన్లు బ్యాంకు అకౌంట్లలో వేయడానికి అదికారయంత్రాంగం ఈసి సూచనల మేరకు ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు రాజకీయాలు స్టార్ట్ చేశారు.చంద్రబాబుకు పాపభీతి లేదు.జగన్ గారిపై ఓర్వలేనితనం. పెద్దవాళ్లన్నా,ముసలి వాళ్లన్నా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు.కనికరం కూడా లేదు.సొంత తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లలేని దుస్తితిలో చంద్రబాబు ఉన్నాడు.తల్లి తండ్రుల మీద ప్రేమ లేని చంద్రబాబుకు అవ్వా తాతల బాధలు ఏమి తెలుస్తాయి. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు ప్రజల సంక్షేమం గుర్తుకు వస్తుంది.నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించి చంద్రబాబు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు . అవ్వ తాతలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయనీ మీకు ఎలా తెలుసు అని చంద్రబాబు అంటున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు రోగాలు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్నాడు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై నోటికి ఏది వస్తే అది చంద్రబాబు మాట్లాడుతున్నాడు. పేదలకు, ఎస్సి,ఎస్టి, బిసి, మైనారిటీలకు జగన్ గారు మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నాడు. కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు.ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కుల మత వర్గ విబేధాలు పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు రెచ్చగొడుతున్నారు.తుని రైలు ఘటన గురించి ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.ఏపిని నిట్టనిలువుగా చీల్చాలని చంద్రబాబు చూస్తున్నాడు.కాని చంద్రబాబు ఆటలు సాగవు.ఎన్నికలలో వైయస్సార్ సిపి ఘన విజయం సాధించబోతోంది.ధనుంజయ్ రెడ్డి అని తన సలహాదారును స్టాటిస్టిటికల్ ఇన్ ఫర్మేషన్ జగన్ గారు అడిగారు.దానిపై ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి అని పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తుంటే చంద్రబాబు ఆయన భజంత్రీలు నిలువెల్లా విషం గక్కుతున్నారు. అధికారులపై కట్టుకధలు రాసి ఎన్నికల కమీషన్ కు పదే పదే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు అని అన్నారు.