పింఛన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు డ్రామాలు కట్టి పెట్టాలని వైయస్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..... ఎన్నిలలో టిడిపి కూటమికి లబ్ది చేకూర్చేందుకు పచ్చమీడియాలో నిత్యం,అసత్యాలు అబద్దాలు రాస్తున్నారు.పచ్చమీడియా పత్రికలు కూటమికి కరపత్రాలుగా మారడమే కాక నిత్యం జగన్ గారిపై విషం చిమ్ముతున్నాయి.పచ్చమీడియాలో రాయడం వాటిని పవన్ కల్యాణ్, చంద్రబాబులు సభలలో మాట్లాడటం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూల్స్ ముసివేయాలని జిఓ ఇచ్చిన విషయం నిజం కాదా? వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక జగన్ గారు తీసుకున్న నాడు-నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు.కార్పోరేట్ స్కూల్స్ లో పోటీపడేరీతిలో నేడు ప్రభుత్వ స్కూల్స్ తయారయ్యాయి.వైద్య,ఆరోగ్యంలో ప్రజలకు భరోసా కల్పంచేందుకు జగన్ గారు ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచారు. 3 వేలకు పైగా అంశాలలో ట్రీట్ మెంట్ ఇచ్చేవిధంగా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దారు. కొన్ని సందర్భాలలో చికిత్స తర్వాత ఉపాధి కింద కొన్ని రోజుల పాటు వారికి కాంపెన్ సేట్ చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యరంగం బలోపేతం చేశారు. వైయస్ఆర్‌సీపీ వచ్చాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మితమవుతున్నాయి.పెన్షన్స్ విషయంలో కలెక్టర్స్ లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు.వాలంటీర్ల ద్వారా సజావుగా సాగుతున్న పెన్సన్ల పంపిణి ప్రక్రియ చంద్రబాబు మనుషుల ఫిర్యాదుతో పెద్ద సమస్యగా మారింది. గత నెలలో 38 మంది వృద్ధుల మరణానికి కారణం చంద్రబాబు ఆయన తరపు మనుషులే కారణం. పెన్షన్స్ పంపిణి అడ్డుకుంది చంద్రబాబు..మళ్ళీ ఎన్నికల కమిషన్ కలుస్తారు. అర్జీలు ఇస్తారు.వృద్ధుల ఉసురు కచ్చితంగా చంద్రబాబుకి తగులుతుంది. వృద్ధుల ప్రాణాలను కాపాడండి వాళ్ళ చావుకి కారణం కావద్దు.చంద్రబాబు తన వైఖరి విడనాడాలి అని సలహా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa