మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. కూటమి అభ్యర్థులు మీ ఇంటికి వచ్చినప్పుడు వైయస్ జగన్ ఎందుకు ఓడించాలి అని ప్రశ్నించాలని ఆయన ప్రజలను కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్నందుకా, గతంలో ఎవరు ఇవ్వలేని విధంగా అవినీతికి త్రోవ లేకుండా సంక్షేమ పథకాలు అందించినందుకా అని ప్రశ్నించాలన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలోచన చేసి ఓటెయ్యాలన్నారు. కేజీ బంగారం ఇస్తానని చెబితే తీసుకోండి కానీ మీ ఇంటిలో మంచి జరిగితే ఫ్యాన్‌కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa