చంద్రబాబూ...ఒళ్లు కొవ్వెక్కి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చంపుతానంటున్నావా? అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. నువ్వు చంపాలనుకుంటున్నది ఒక ప్రజా నాయకుడిని, ప్రజల గుండె చప్పుడిని. వైయస్ జగన్ గారిని చంపడం అంటే రాష్ట్రంలో ఆరు కోట్ల మందిని చంపడమే అన్నారు. టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..... రాజకీయాల్లో కుసంస్కారి, అబద్ధాల పుట్ట అయిన చంద్రబాబు...ఎన్నికల సమయంలో తన అసలు రూపాన్ని చూపుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తానొక్కడే అర్హుడే అనే పిచ్చి బ్రమలో పైశాచికత్వంతో గతితప్పి మతి చెడి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని చంపుతాను అంటూ మాట్లాడటాన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని అనేక సార్లు చెప్పాం. ఆయన మాటలు తూలడం, జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించడం, నిందలు వేయడం, చాలా చులకనగా మాట్లాడటం ఆయనకి ఆనవాయితీగా మారిపోయింది. రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు నిజస్వరూపాన్ని గమనించమని వేడుకుంటున్నాం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు విజయవంతమైన పరిపాలన అందించిన వ్యక్తిని పట్టుకుని చంపుతానని ఓ ప్రతిపక్ష నాయకుడు అంటున్నాడంటే ఏ కోణంలో మనం చూడాలి. ఈ రాష్ట్రంలో జరిగిన అనేక హత్యా రాజకీయాలు, దాడులు, కేసులు, విభజనలు, ఘోరాలు, నేరాలు టీడీపీ చేసిందని మేం చెప్తూనే ఉన్నాం. ఆనాడు మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఇవన్నీ చెబితే మేమేదో రాజకీయంగా మాట్లాడాం అన్నారు. ఇప్పుడు స్వయాన చంద్రబాబే నిన్ను చంపితే దిక్కెవరు అంటున్నాడంటే ఆయన ఆలోచన ఏంటి? ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడా? మతి చెడి మాట్లాడుతున్నాడా? రేపు జూన్ 4వ తేదీన మూటగట్టుకునే ఓటమి గుర్తొచ్చి మాట్లాడుతున్నాడా? చంద్రబాబునాయుడు మానసిక పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రజలు గమనించాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa