ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామని ఉద్ఘాటించారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని తెలిపారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టుంది. జట్టుకట్టి… ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు.