ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని ఉరవకొండ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతోనే దిగజారి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యక్తిగత వినాశనాన్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా సభలో.. `జగన్.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది' అంటూ చంద్రబాబు బరితెగించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైయస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa