ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైయస్ఆర్సీపీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు చేశారు.ఇందుకు తగిన ఆధారాలను అందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈనెల 28 వతేదీన జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం కాబట్టి పవన్ కల్యాణ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.