“ప్రతి ఇంటికి లబ్ధి జరిగితేనే ఓటేయండి”అని పిలుపునిచ్చిన ధీరశాలి, దమ్ము, ధైర్యం ఉన్న సాహసి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని నినాదంతో ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల వద్దకు వచ్చిన నేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పొదిలి మండలంలోని ఆముదాలపల్లి, నిమ్మవరం, సల్లోడివారిపాలెం,తీగదూర్తిపాడు, రాములవీడు, కేశవబొట్లపాలెం, పాములపాడు, గొల్లపల్లి, సింగంరెడ్డిపల్లి, సూదనగుంట్ల, రామాపురం, ఈగలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ఆశీర్వదించి మీ దగ్గరికి పంపించారని.. ఆయన గర్వపడేలా ప్రజలతో మమేకమవుతానని.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa