ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి కాలేజీ రోడ్డులో గల సప్తగిరి లాడ్జి వరకు శుక్రవారం ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రకాశం యువ ఓటరు సంకల్పం కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa