జమ్మలమడుగులో మహబూబ్ బాష (20) అనే వ్యక్తి గురువారం సాయంత్రం షాపులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు దేవగుడి గ్రామానికి చెందిన మహబూబ్ బాష కాపు వీధిలోని ఓ షాపులో కుట్టు మిషన్ మెకానిజంలో శిక్షణ పొందుతున్న షాపులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa