అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని దలవాయిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు ఈవీఎంలను పగలగొట్టడంతో పోలింగ్ నిలిచిపోయింది. అక్కడే తమ పోలింగ్ ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేశారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ కార్యకర్తలు బలవంతంగా అతడిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లారని పేర్కొంది.