శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి సోమవారం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ మూడో వార్డు 42వ బూత్ లో క్యూలో నిలబడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర దేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు.