ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజ్వల్‌ మా అమ్మను రేప్ చేసి, బలవంతంగా నా బట్టలు విప్పించాడు

national |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 07:51 PM

మహిళలపై హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఘాయిత్యాలు, లైంగిక దౌర్జ్యనాలు వ్యవహారం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యువ ఎంపీ దారుణాలపై దర్యాప్తునకు కర్ణాటక సర్కారు నియమించిన సిట్‌ విచారణను వేగవంతం చేసింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన ఓ యువతి.. అతడి గురించి దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. సిట్‌ ముందు హాజరైన వాంగ్మూలం ఇచ్చిన ఆమె.. నాలుగైదేళ్ల కిందట బెంగళూరులోని నివాసంలో తన తల్లిపై ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. అంతటితో ఆగకుండా తనకు తరుచూ వీడియో కాల్ చేసి.. బెదిరించి తన దుస్తులను బలవంతంగా విప్పించేవాడని వాపోయింది.


‘2020 నుంచి 2021 మధ్య ప్రజ్వల్ రేవణ్ణ మా అమ్మ ఫోన్‌కు కాల్‌ చేసి.. వీడియో కాల్‌లో మాట్లాడాలని నన్ను బలవంతం చేసేవాడు.. నా ఒంటిపై బట్టలు విప్పాలని అడిగేవాడు.. నేను అందుకు అంగీకరించకపోతే మా అమ్మతో పాటు నాకు హాని తలపెడతానని బెదిరించేవాడు’ అని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణ తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని, తనపై అత్యాచారం చేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది.


ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన తండ్రిని ఉద్యోగం నుంచి తీసేశారని పేర్కొంది. తన ఇంట్లో పనిచేసే చాలా మంది మహిళలను ప్రజ్వల్‌ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. చాలా మంది బాధితులు ఉన్నారని.. కేవలం ముగ్గురు మాత్రమే ముందుకొచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేశారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన అనంతరం తమ భూమిని కూడా బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదనకు గురయ్యింది.


‘‘ఇంట్లో పనిచేసే మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమే.. పండ్లు ఇచ్చే సాకుతో స్టోర్ రూమ్‌కి రప్పించి అత్యాచారాలు చేసేవాడు.. మా అమ్మపై కూడా అత్యాచారం చేశాడు.. కేవలం ముగ్గురు మాత్రమే బయటకు వచ్చి అతడి దారుణాలు బయటపెట్టారు..అక్కడ పనిచేసే మరో ముగ్గురు మహిళలు ఈ దారుణాల గురించి నాకు చెప్పారు.. వాళ్లపై కూడా లైంగిక దౌర్జన్యాలకు తెగబడ్డాడు’ అని చెప్పింది.


‘మా అమ్మ నాలుగైదు నెలలకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేది... చాలా వేధింపులకు గురైంది.. అర్థరాత్రి 1 లేదా 2 గంటల సమయంలో మాత్రమే మాకు ఫోన్ చేసి మాట్లాడేది. వారు మా అమ్మను బానిసలా చూసుకున్నారు, నాన్నపై దాడి చేశారు’ అని కన్నీటిపర్యంతమయ్యింది. మరోవైపు, ప్రజ్వల్‌ రేవణ్ణ, ఆయన తండ్రిపై ఇప్పటి వరకూ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హెచ్‌డీ రేవణ్ణను అరెస్ట్ చేయగా.. మే 14 వరకు అతడికి కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa