అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్లపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను అడ్డుకునేందుకు వెళ్లిన పట్టణ సీఐ మురళీకృష్ణ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దాంతో అల్లర్లకు కారణమైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.