ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైంగిక దాడికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 03:37 PM

బాలికపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయకపోగా అతడ్ని ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించి తిరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు బాధితులతో కలిసి మంగళవారం రాత్రి ఎ.కొండూరు పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. రామచంద్రాపురానికి చెందిన బాలిక (11) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు ఓటు వేసేందుకు వెళ్లగా ఇంటి పక్కనే ఉంటున్న మల్లాది చిలకారావు (22) బాలికను చేయిపట్టుకొని పక్కనే ఉన్న ఇంట్లోకి లాకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. జరిగిన విషయం బాలిక తల్లికి తెలపగా వారు చిలకారావును ప్రశ్నించారు. నిందితుడి కుటుంబసభ్యులు బాధితురాలి కుటుంబసభ్యులతో కర్రలతో దాడి పాల్పడ్డారు. దాడిలో తిరుపతిరావు, దుర్గారావు, సాయికుమార్‌లు త్రీవంగా గాయపడ్డారు. ఘటన జరిగి 24 గంటలైనా సకాలంలో పోలీసులు స్పందించకపోవడంతో స్థానిక టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు బాధితులతో కలిసి పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు నిందితునిపైన, దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు. కార్యక్రమంలో పిట్టా చైతన్య, హరిబాబు, డేవిడ్‌రాజు, చందు, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa