ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డి చర్ల గ్రామంలో గురువారం మట్టి మాఫియా రెచ్చిపోయింది. రెడ్డి చర్ల గ్రామ సమీపంలోని చెరువులో మట్టి మాఫియా జెసిబి సహాయంతో మట్టి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా తరలించి తీసుకువెళ్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే మట్టి మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa