రైల్వే కోడూరులోని గంగమ్మ జాతర మహోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహిస్తున్నారు. వేప మండలతో ప్రత్యేకంగా నిర్మించిన గంగమ్మ గుడి లోపలికి గంగమ్మ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించారు. అప్పటినుండి భక్తులు పొంగళ్ళు పెట్టి ప్రసాదాలు అర్పించారు. సాంప్రదాయంగా వస్తున్న గంగమ్మకు బలిదానం అర్పించారు. సాయంత్రం వరకు గంగమ్మను దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలి వస్తారని నిర్వాహకులు తెలిపారు.