ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక పరిశీలించారు. ఈవీఎంలను ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల కేంద్ర పోలీస్ బలగాల గార్డును పరిశీలించారు. జిల్లా ఆర్మ్డ్ పోలీస్ గార్డు, సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. తనిఖీ అధికారులు నిరంతరం పహారాను తనిఖీ చేయాలన్నారు.