విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ పార్వతీపురం మన్యం ఆర్టీఎ విభాగంలో విధులు నిర్వహిస్తూ, ఇటీవల మృతిచెందిన కె. మహేశ్వరరావు కుటుంబానికి సిబ్బంది ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు హోంగార్డు చేయూత కింద ఒకరోజు అలవెన్స్ రూ. 3. 20 లక్షల చెక్కును మృతుడి సతీమణి కె. ధనలక్ష్మికి ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం అందజేశారు.