డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూర విద్యా విధానంలో డిగ్రీ నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన రుసుమును ఈ నెల 31లోపు ఆన్లైన్లో చెల్లించాలని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆ విద్యాలయ అధ్యయన కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ బుధవారం పేర్కొన్నారు. ఆరో సెమిస్టర్ జూన్ 24 నుంచి 29 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జులై 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.