శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త షేక్ దాదా ఖలందర్ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గ్రామంలో వలి, మస్తాన్ బీ దంపతుల కుమారుడు వ్యక్తిగత పనీమీద వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన ఖలందర్ ని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ గురువారం మృతిచెందారు. మృతిపై వైసిపి నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు.