కళ్యాణదుర్గం పట్టణంలోని యూ. పి. హెచ్. సి ఇందిరమ్మ కాలనీ నందు గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈ. బి. దేవి, జిల్లా మాస్ మీడియా అధికారులు ఉమాపతి, త్యాగరాజు, గంగాధర్ వైద్య సిబ్బందికి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దోమల కాటు వలన డెంగ్యూ వ్యాధి సోకుతుందన్నారు. కావున దోమల నివారణ చర్యలు పాటించాలన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.