ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ యంత్రాలు మూలకు చేరడంతో డయాలసిస్ రోగులు తీవ్ర అవస్థలు గురవుతున్నారు. ఆస్పత్రిలో 17 డయాలసిస్ యంత్రాలు ఉంటే 13 యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. 4 యంత్రాలతో మాత్రమే రోగులకు వైద్యం అందిస్తున్నారు. వైద్యం చేయించుకునేందుకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa