రాయదుర్గం పట్టణంలో ఆత్మకూరి వీధిలో వెలసిన మహిమాన్విత దశబుజ వినాయకుడికి టిడిపి శ్రేణులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, రాయదుర్గం నుండి కాలువ ఎమ్మెల్యేగా అధిక విజయం సాధించాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. దాసరి సత్తి, పై తోట సీన, తదితరులు పాల్గొన్నారు.